ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. జీవితంలో అభివృద్ధి
సాధించాలని, ఉన్నత శిఖరాలకు చేరాలని అనుకుంటారు. ఇదే ఆలోచన ప్రతి ఒక్కరిని
ఉద్యోగం లేదా వ్యాపారంలో కష్టపడేలా ప్రేరేపిస్తుంది. మీరు బిజినెస్ చేయాలనుకుంటే చాలా
వ్యాపారాలున్నాయి. అలాంటి వాటిలో మెడికల్ షాప్ ఒకటి. ఎవరైనా వ్యాపారాన్ని
ప్రారంభించాలంటే సంకోచిస్తారు. ఎందుకంటే దానికి సంబంధించి వారికి సరైన నాలెడ్జ్ ఉండదు.
ఈ ఆర్టికల్ లో మెడికల్ షాపు ఎలా ప్రారంభించాలనే విషయానికి సంబంధించిన సమాచారం
మేము మీకు అందిస్తాం. మీకు అవసరమైన విషయాలన్నీ తెలియజేస్తాం.
మెడికల్ షాపు బిజినెస్ కు ఉండే అవసరాలు
ఎంత లాభం పొందవచ్చు
ఎలాంటి అర్హతలుండాలి
మార్కెట్ కు సంబంధించిన నాలెడ్జ్
షాప్ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు
న్యాయపరమైన ప్రక్రియ
మార్కెటింగ్ ఎలా చేయాలి
మెడికల్ షాప్ బిజినెస్ గురించి క్లుప్తంగా (Executive Summary)
మందుల షాపు నిర్వహించడాన్నే ఫార్మసీ బిజినెస్ అంటారు. ఏ కాలంలోనైనా లాభాలు వచ్చే
బిజినెస్ ఇది. అయితే సరైన సమాచారం, నాలెడ్జ్ లేక చాలా మంది ఈ బిజినెస్ ఎలా
చేయాలో తెలియక బాధ పడుతుంటారు. ఈ ఆర్టికల్ లో మెడికల్ షాప్ ఎలా ప్రారంభించాలో
మీరు పూర్తిగా తెలుసుకుంటారు.
ఫార్మసీలో వ్యాపార అవకాశాలు (Business Opportunities in Pharmacy)
ఫార్మసీ బిజినెస్ మొదలుపెట్టడానికి కనీస పెట్టుబడి అవసరం. అయితే ఈ వ్యాపారానికి ఉన్న
ఎప్పటికీ తగ్గని డిమాండ్ కారణంగా ఇది లాభాలు ఇచ్చే వ్యాపారంగా గుర్తింపు పొందింది. దేశ
ఆర్థిక పరిస్థితులు ఈ వ్యాపారంపై ఎలాంటి ప్రభావం చూపించవు. ఎందుకంటే మందులకు
పెరుగుతున్న డిమాండ్ అలా ఉంది. కొన్ని అధ్యయనాల ప్రకారం 2050 కల్లా కనీసం 20
శాతం మంది ప్రజలు 60 ఏళ్లపైబడిన జనాభాకు జత అవుతారు. సాధారణంగా ఈ వయసు
వారికి మందుల అవసరం ఉంటుంది. కాబట్టి మందుల బిజినెస్ పెరుగుతుంది. కాబట్టి ఇది
లాభాలు వచ్చే వ్యాపారం.
పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం 2009లో ఫార్మసీ బిజినెస్ 1300 కోట్ల రూపాయలు. 2020 కల్లా
అది 35000 కోట్లను చేరే అవకాశం ఉంది. ఈ గణాంకాలు ఫార్మసీ బిజినెస్ లాభాలు
అందిస్తుందనేందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.
ఒకసారి మీరు మెడికల్ స్టోర్ లో పెట్టుబడి పెడి విజయవంతంగా ప్రారంభిస్తే మీరు లాభాల
గురించి బెంగపడనక్కర్లేదు. ఆ తర్వాత మీరు ఒకే పేరు మీద వివిధ బ్రాంచులు ప్రారంభించి మీ
వ్యాపారాన్ని విస్తరించవచ్చు.
ఎంతమేరకు లాభం ఉంటుంది ? (How profitable is it?)
రిటైల్ మెడికల్ షాపులో లాభాల శాతం 5 నుంచి 30 శాతం మధ్యలో ఉంటుంది. ప్రతి ఒక్క
మందు వేర్వేరు లాభాల శాతాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకు ఎఫ్ఎమ్ సీజీ ఉత్పత్తులు
మంచి లాభాలను ఇస్తాయి. జనరిక్ మందులు, ఓటీసీ(ఓవర్ ది కౌంటర్) మందులు, బ్రాండెడ్
మందుల లాభాలు ఒకదానితో ఒకటి పోలిస్తే వేరుగా ఉంటాయి. ఈ మందుల మీద కస్లమర్లకు
మీరు 5 నుంచి 20 శాతం వరకు రాయితీ ఇచ్చినప్పటికీ మీకు 5 నుంచి 25 శాతం వరకు
లాభం పొందే అవకాశం ఉంటుంది.
ఈ కింది చార్టులో ఏ మందులైనా రాయితీ తర్వాత అమ్మితే ఎంత లాభం వస్తుందో మీకు
తెలియజేస్తుంది.
మెడికల్ షాపు బిజినెస్ మీరు ఎలా ప్రారంభించవచ్చు (Execution – How you can
start the Pharmacy Business)
అర్హత (Qualification)
మెడికల్ షాపు ప్రారంభించడానికి కావాల్సిన తప్పనిసరి అర్హతలు ఇవే.
- సైన్స్ సబ్జెక్టు ప్రధానాంశంగా 12వ తరగతి
- ఫార్మసీలో డిగ్రీ.
డ్రగ్ లైసెన్స్ జారీ చేయబడిన వ్యక్తికి పైన తెలిపిన అర్హతలు ఉండాలి. (డ్రగ్ లైసైన్స్ కు
సంబంధించిన సమాచారం కింద ఇవ్వబడింది)
ఈ అర్హతలు లేకపోయినా మీరు మెడికల్ స్టోర్ ప్రారంభించవచ్చు. కానీ అర్హత కలిగిన వ్యక్తి పేరు
మీద మాత్రమే లైసెన్స్ జారీ చేయబడుతుంది. మెడికల్ స్టోర్ ప్రారంభించడానికి డ్రగ్ లైసెన్స్
కలిగి ఉండటం తప్పనిసరి.
ఆధారం: ఫార్మాహెల్ప్
ఎవరైనా పైన తెలిపిన తగిన అర్హతలు కలిగి ఉంటే వారి పేరు మీద మీరు డ్రగ్ లైసెన్స్
తీసుకోవచ్చు.
గమనిక: ఎవరి పేరు మీద డ్రగ్ లైసెన్స్ జారీ చేసి ఉంటుందో ఆ వ్యక్తి మీ షాపులో అన్ని వేళలా
హాజరై ఉండాలి. డ్రగ్ తనిఖీలు చేసినపుడు ఆ లైసెన్స్ ఉన్న వ్యక్తి షాపులో లేకపోతే మీ
లైసెన్సు రద్దు చేస్తారు. అయితే మెడిసిన్స్ రంగంలో మీరు ఒక ఏడాది అనుభవం కలిగి
ఉన్నట్లయితే లైసెన్స్ లేకపోయినా మీరు షాపు నిర్వహించుకోవచ్చు.
షాపు ప్రారంభించడానికి కావాల్సిన అర్హతలు సంపాదించిన తర్వాత తెలుసుకోవాల్సిన ముఖ్య
విషయం మార్కెట్ గురించి. ఎక్కడ మీ స్టోర్ ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తుందో
తెలుసుకోవాలి. ఈ కింద పేర్కొన్న విషయాలు మీరు తెలుసుకుని ఉండాలి.
మార్కెట్ ను అర్థం చేసుకోవడం (Understanding about the market)
షాపు ప్రారంభించడానికి ముందు మార్కెట్ ను మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇంతకు ముందే ఉన్న మెడికల్ స్టోర్ ను కొనుగోలు చేయడమా లేదా కొత్త షాపు
ప్రారంభించడమా
మీరు సొంతంగా ఫార్మసీ బిజినెస్ చేయాలనుకుంటే మీరు అప్పటికే ఉన్న మెడికల్ స్టోర్ ను
కొనుగోలు చేయవచ్చు లేదా కొత్త స్టోర్ ప్రారంభించవచ్చు. ఈ రెండు ఎంపికల్లోనూ లాభ
నష్టాలు ఉన్నాయి.
ఈ రెండు ఎంపికల్లోనూ లాభ నష్టాలు ఉన్నాయి.
పాత ఫార్మసీ | కొత్త ఫార్మసీ |
లాభాలు మీకు పాత కస్టమర్లు అందుబాటులో ఉంటారు. పెట్టుబడి, మౌలిక సదుపాయాల ఖర్చు తక్కువగా ఉంటుంది.కొత్త సిబ్బందిని నియమించుకోవాల్సిన అవసరం ఉండదు. పాత సిబ్బందే అందుబాటులో ఉంటారు.షాపు ప్రచారం కోసం చేసే ఖర్చును తగ్గించుకోవచ్చు. | లాభాలు తక్కువ పెట్టుబడితో మీరు కొత్త షాపు ప్రారంభించవచ్చు.తక్కువ మూల ధనంతో మీరు కొత్త షాపు ప్రారంభించవచ్చు.మీకు కోరుకున్న ప్రాంతంలో మీరు షాపు ప్రారంభించవచ్చు. |
ప్రతికూలతలు పాత షాపు కొనడానికి భారీగా డబ్బులు అవసరం కావొచ్చు.మీరు తీసుకునే బ్యాంక్ రుణం ఎక్కువ కావొచ్చు.మీరు తక్కువ మంది ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. | ప్రతికూలతలు కొత్త కస్టమర్లను సంపాదించుకోవడం కష్టం.కొత్త సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది.షాపు ప్రచారం కోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. |
- ఏ ప్రాంతం అనుకూలమో వెతకండి (Search about the locality and the area)
ఏ ప్రాంతంలో షాపు పెడితే బాగుంటుందని మీరు పరిశోధన చేస్తున్నప్పుడు ఆ ప్రాంతం
గురించి మీకు అవగాహన పెరుగుతుంది. అలాగే ఆ ప్రాంతం అవసరాలు కూడా మీకు
తెలుస్తాయి. ఇంటి వద్దకే మందులు పంపించడం లాంటి సౌకర్యాలు అక్కడ లేకపోతే మీరు ఆ
సేవలను అక్కడ ప్రారంభించవచ్చు. ఆ ప్రాంతంలో వృద్ధులు, పసి పిల్లలు ఎక్కువ మంది ఉంటే
మందుల అవసరం ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్లు రోగాల బారిన పడే అవకాశాలు
ఎక్కువగా ఉంటాయి.
● ఆ ప్రాంతంలో ఉన్నవారి ఆర్థిక స్థితుగతులు అర్థం చేసుకోండి. దానికి అనుగుణంగా
మీరు రాయితీలు ఇవ్వవచ్చు. అలాగే మందుల ధరలు నిర్ణయించవచ్చు.
● ఆ ప్రాంతంలో ఎన్ని మందుల దుకాణాలు ఉన్నాయో తెలసుకోవాలి. ఎందుకంటే
ఎక్కువ షాపులు ఉంటే పోటీ ఎక్కువ ఉంటుంది. అలాగే అమ్మకాలు తక్కువ
ఉంటాయి. మీ షాపు కొనసాగడానికి మీరు చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.
● మీరు మెడికల్ షాపు ప్రారంభించే ముందు మీరు ఆ ప్రాంతం గురించి అంచనా
వేయాలి. అక్కడ షాపులుంటే కస్లమర్లు కూడా బాగానే ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.
లాభాలు కూడా బాగానే వస్తాయని తెలుసుకోవాలి.
● ఇటీవల ఏదైనా మెడికల్ షాపు మూతపడి ఉంటే దానికి గల కారణాలు తెలుసుకోండి.
అది మీ ప్రయత్నాన్ని, డబ్బును ఆదా చేస్తుంది.
● పెట్టుబడి, మౌలిక సదుపాయాలు (Investment and Infrastructure)
మెడికల్ షాపు ప్రారంభించడానికి ప్రారంభ పెట్టుబడి అవసరం. మీరు ఎక్కడ వ్యాపారం
ప్రారంభిస్తున్నారు, మీ చిల్లర వర్తకుడిగా వ్యాపారం చేస్తున్నారా లేదా డిస్ట్రిబ్యూటర్
గానా లేదా హోల్ సేల్ షాపు ప్రారంభించబోతున్నారా అనే దానిపై ఎంత పెట్టుబడి
పెట్టాలనేది ఆధారపడి ఉంటుంది.
ఇది కాకుండా షాపు కిరాయి, ప్రచార ఖర్చు, న్యాయ పరమైన ఖర్చులు,
మరమ్మతులకు డబ్బు అవసరం అవుతుంది.
సుమారు 4-5 లక్షల రూపాయల పెట్టుబడి ఉంటే 10 చదరపు అడుగుల్లో మీరు వ్యాపారం
ప్రారంభించవచ్చు. డ్రగ్ లైసెన్స్ ఫీజు, మెడిసిన్స్ స్టాక్ కలిపి ఇంత పెట్టుబడి అవసరం. (షాపు
కిరాయి/మౌలిక సదుపాయాలు/షాపు కొనుగోలు ఖర్చులు కాకుండా)
మెడికల్ షాపులో మీరు వివిధ రకాల మందులు, పరికరాలు అమ్మకానికి పెట్టాల్సి ఉంటుంది.
వీటిని ఒక వరుసలో పద్ధతి ప్రకారం పెట్టడానికి మీకు చెక్క షెల్ప్ లు అవసరం.
కింద తెలిపిన ఫర్నీచర్ షాపు ప్రారంభించడానికి అవసరం
ఫర్నీచర్ | ఫర్నీచర్ సంఖ్య | ధర (సుమారుగా) |
స్లైడింగ్ గ్లాస్ ఉన్న షో కేస్ | 1 | రూ.10,500 |
మెడికల్ స్టోర్ డిస్ ప్లే రాక్స్ | 1 | రూ.18,000 |
ఫార్మసీ ర్యాక్ | 1 | రూ.21,000 |
అరలు ఉన్న ఫార్మసీ కౌంటర్ | 1 | రూ.8000 |
మెడికల్ స్టోర్ కౌంటర్ | 1 | రూ.39000 |
క్యాష్ కౌంటర్ | 1 | రూ.4700 |
కంప్యూటర్ కౌంటర్ | 1 | రూ.4500 |
మొత్తం | రూ.1,05,700 |
ఆధారం: ఇండియా మార్ట్
మౌలిక సదుపాయాలు, డాక్యుమెంటేషన్, స్టాక్ మొత్తం బడ్జెట్ కలిపి 5 నుంచి 7 లక్షలు
అవుతుంది. కింది టేబుల్ ను బట్టి మొత్తం పెట్టుబడి ఇతర ఖర్చులను మీరు లెక్క
వేసుకోవచ్చు.
పూర్తి బిజినెస్ కోసం | రూ.5,00,000 |
ఖర్చులు | రూ.7,00,000 |
కింద పేర్కొన్న వెబ్ సైట్లను పరిశీలించి మీరు మీకు కావాల్సిన ఫర్నీచర్ అద్దెకు
తెచ్చుకోవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు. ఫర్నీచర్ కు సంబంధించిన తగినంత
సమాచారం మీకు ఇందులో దొరుకుతుంది. దీంతో పాటు లైసెన్స్ ఫీజు, మౌలిక సదుపాయాల
ఖర్చు ఎంతో మీరు తెలుసుకోవచ్చు.
● మేజిక్ బ్రిక్స్
● 99 ఏకర్స్.కామ్ (99Acres.com)
● ఓఎల్ఎక్స్(OLX)
పెట్టుబడి కోసం మీరు కింద తెలిపిన మూడు పద్ధతులను ఎంపిక చేసుకోవచ్చు.
వ్యక్తిగత పెట్టుబడి (Personal Investment)– వ్యక్తిగత పెట్టుబడి అంటే మీ సొంత
డబ్బులను మీరు షాపులో పెట్టుబడి పెట్టడం. ఇది ఒక మంచి ఎంపిక. ఎందుకంటే మీరు
రుణం తీసుకోరు కాబట్టి మీరు తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ అంశం మీ వెంచర్
మీద పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్లకు నమ్మకాన్ని పెంచే విషయం అవుతుంది.
ఏజెంల్ ఇన్వెస్టర్ (Angel Investor) – ఏంజెల్ ఇన్వెస్టర్లు అంటే ఇతరుల వ్యాపారాల్లో
తగినంత పెట్టుబడి పెట్టగలిగేవాళ్లు. చిన్న తరహా వ్యాపారాల్లో వాళ్లు నేరుగా పెట్టుబడి
పెట్టగలరు. వాళ్లకు పెట్టుబడి పెట్టడంలో అనుభవం ఉంటుంది. చిన్న తరహా వ్యాపారాలు
విస్తరించడానికి వాళ్లు సాయం చేస్తారు. ఇంటర్నెట్ లో మీ చుట్టు పక్కల ఎవరైనా ఇన్వెస్టర్లు
ఉన్నారేమోనని మీరు చూడవచ్చు. వారిని సంప్రదించేముందు మీరు సరైన ప్రణాళిక సిద్ధం
చేసుకుని ఉండాలని మరచిపోవద్దు.
బ్యాంక్ రుణం(Bank Loan) – చిన్న తరహా లేదా మధ్య తరహా పరిశ్రమల నిర్వహణలో
బ్యాంకు రుణాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మీ దగ్గర తగినంత పెట్టుబడి లేెకపోతే మీరు బ్యాంకు
రుణం తీసుకోవచ్చు. బ్యాంకు రుణం తీసుకోవాలంటే కింది అర్హతలు ఉండాలి.
వయో పరిమితి 21 నుంచి 65 ఏళ్ల మధ్యలో ఉండాలి.
● కనీసం రూ.1,50,000 లాభం వస్తుందని మీరు బ్యాంక్ అధికారులకు సాక్ష్యం
చూపించాల్సి ఉంటుంది.
● మీ వ్యాపారం గురించి సమగ్రమైన ప్రణాళిక బ్యాంక్ అధికారులకు చూపించాల్సి.
అలాగైతేనే వాళ్లు మీ బిజినెస్ గురించి సరిగా అర్థం చేసుకుంటారు.
మరొక ముఖ్యమైన గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే బీమా. మన దేశంలో
చాలా మంది బీమాను నిర్లక్ష్యం చేస్తారు. దానికి తగిన ప్రాధాన్యత ఇవ్వరు. అయితే
ఏదైనా ప్రమాదాలు జరిగితే బీమా ఎంతో ఉపయోగపడుతుంది. మరింత సమాచారం
కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
https://www.policybazaar.com/business-shop-insurance/
న్యాయ పరమైన ప్రక్రియ (Legal Procedures)
ఫార్మసీ బిజినెస్ లో టాక్స్ రిజిస్ట్రేషన్ అంటే వ్యాట్(విలువ ఆధారిత పన్ను) రిజిస్ట్రేషన్.
ఇండియాలో మీరు ఏవైనా వస్తువులు అమ్మాలంటే వ్యాట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. మెడికల్ స్టోర్
కు సంబంధించి రెండు రకాల రిజిస్ట్రేషన్లు అవసరం. పన్ను (వ్యాట్/జీఎస్టీ) రిజిస్ట్రేషన్,
డ్రగ్/ఫార్మసీ లైసెన్స్.
పన్ను రిజిస్ట్రేషన్ – వ్యాట్ (Tax Registration – VAT)
వ్యాట్ రిజిస్ట్రేషన్ రాష్ట్ర ప్రభుత్వం కిందకు వస్తుంది. మీరు ఒక వేళ ఢిల్లీలో మెడికల్ షాపు
తెరవాలనుకుంటే ఢిల్లీ వ్యాట్ రిజిస్ట్రేషన్ అధికారిక వెబ్ సైట్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి
ఉంటుంది.
అలాగే ఇతర రాష్ట్రాల్లో అయితే ఆయా రాష్ట్రాల వ్యాట్ రిజిస్ట్రేషన్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి
ఉంటుంది. కొన్ని రాష్ట్రాల వ్యాట్ రిజిస్ట్రేషన్స్ సైట్స్ కింద పేర్కొనబడ్డాయి.
https://www.dvat.gov.in/
https://haryanatax.gov.in/
http://comtax.up.nic.in/
https://www.mahagst.gov.in/
https://ctd.tn.gov.in/Portal/
https://www.commercialtax.gujarat.gov.in/
http://vat.kar.nic.in/vat2/
http://old.keralataxes.gov.in/
ట్యాక్స్ రిజిస్ట్రేషన్ – జీఎస్టీ (Tax Registration – GST)
మీరు మీ వ్యాపారాన్ని జీఎస్టీ(వస్తు సేవల పన్ను) కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
పన్ను వ్యవహారాల కోసం ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
భారత్ లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ చాలా సరళతరంగా ఉంటుంది. దేశంలో ఎక్కడి నుంచైనా మీరు
ఆన్లైన్ ఫామ్ పూరించవచ్చు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరిగా కావాల్సిన కొన్ని పత్రాలు
ఇక్కడ పేర్కొన్నాం.
ఆధారం: ఇండియా ఫైలింగ్స్
జీఎస్టీ రిజిస్ట్రేషన్ ను అధికారిక వెబ్ సైట్ లో చేయాలి. వెబ్ సైట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్
చేయండి. https://www.gst.gov.in/
రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా నింపాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
https://www.indiafilings.com/learn/gst-registration-procedure/
డ్రగ్/ఫార్మసీ లైసెన్స్ రిజిస్ట్రేషన్ (Drug/Pharmacy License Registration)
మెడికల్ స్టోర్ లేదా ఫార్మసీ వ్యాపారం ప్రారంభించడానికి డ్రగ్ లైసెన్స్ తప్పనిసరి. డ్రగ్ లైసెన్స్
లేకపోతే మీరు షాపు నిర్వహించడానికి ఉండదు. డ్రగ్, కాస్మెటిక్ చట్టం, 1940 ప్రకారం లైసెన్స్
కలిగి ఉండటం తప్పనిసరి.
ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో మీరు మెడికల్ స్టోర్ లేదా ఫార్మసీ వ్యాపారం
ప్రారంభించాలనుకుంటే ప్రతి రాష్ట్రానికి వేర్వేరుగా లైసెన్స్ తీసుకోవాలి. ఒకే రాష్ట్రంలో వేర్వేరు
చోట్ల మీరు షాపులు ప్రారంభించాలనుకుంటే ప్రతి షాపుకి మీరు వేర్వేరుగా లైసెన్స్
తీసుకోవాలి.
డ్రగ్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటే మీరు మీ వ్యాపారాన్ని ఎల్ఎల్ పీ లేదా ప్రైవేట్ లిమిటెడ్
కంపెనీగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
డ్రగ్ లైసెన్స్ జారీ చేయడానికి ఇద్దరికి అధికారం ఉంటుంది.
● కేంద్ర డ్రగ్ ప్రమాణాల నియంత్రణ సంస్థ
● రాష్ట్ర డ్రగ్ ప్రమాణాల నియంత్రణ సంస్థ
డ్రగ్ లైసెన్స్ కావాలనుకుంటే మీరు రాష్ట్ర డ్రగ్ ప్రమాణాల నియంత్రణ సంస్థ(ఎస్ డీ ఎస్
సీఓ)ను సంప్రదించాలి. ప్రతి రాష్ట్రానికి సొంత ఎస్ డీ ఎస్ సీఓ ఉంటుంది. వాటికి సంబంధించిన
వివరాలు పీడీఎఫ్ రూపంలో కింద తెలుసుకోవచ్చు.
https://www.indiafilings.com/learn/wp-content/uploads/2015/04/State-
Drugs-Control-Organization-List.pdf
ఆధారం: ఇండియా ఫైలింగ్స్
డ్రగ్ లైసెన్స్ కోసం అవసరమైన అంశాలు (Requirements for Drug license)
డ్రగ్ లైసెన్స్ పొందడానికి మీరు కొన్ని అవసరమైన విషయాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.
● స్థలం (Area): మీరు ఫార్మసీ వ్యాపారం ప్రారంభించాలనుకుంటే, కనీసం 10 చదరపు
అడుగుల స్థలం కలిగి ఉండాలి. మీరు రిటైల్ లేదా హోల్ సేల్ దుకాణం
తెరవాలనుకుంటే 15 చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుంది.
● మౌలిక సదుపాయాలు(Infrastructure) : వివిధ పరికరాలు, మందులు పెట్టడానికి
అవసరమైన కంపార్టుమెంట్లు, అరలు కలిగి ఉండే విధంగా మీరు మీ మెడికల్ షాపును
డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇవి కాకుండా కాలం చెల్లిన మందులు ఉంచడానికి వేరొక విభాగం కలిగి ఉండాలి.
● నిల్వ సదుపాయం(Storage Facility): ఒక రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండీషనర్ మీకు
అవసరం అవుతుంది. వ్యాక్సిన్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్ల మీద ఖచ్చితంగా వాటి పేర్లు
రాసి రిఫ్రిజిరేటర్ లో పెట్టాలి.
● సాంకేతిక సిబ్బంది(Technical Staff): చిల్లరగా మీరు మందులు అమ్మాలనుకుంటే
ప్రభుత్వ గుర్తింపు పొందిన రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అయ్యుండాలి. కింద పేర్కొన్న అర్హతలు
ఉన్న ఎవరినైనా మీరు సిబ్బందిగా ఉంచుకోవచ్చు.
● రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ గుర్తింపు పొందిన రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్
● మందుల అమ్మకాలు, మార్కెటింగ్ లో ఏడాది అనుభవం ఉన్న పట్టభద్రుడు.
● ఎస్.ఎస్.ఎల్.సీ ధ్రువీకరించిన నాలుగేళ్ల అనుభవం ఉన్నవారు.
● ఔషధ నియంత్రణ విభాగం ఆమోదం పొందినవారు.
స్టోర్ లో మీకు సాయం చేయడానికి ఒక సహాయకుడిని లేదా మరొక ఫార్మసిస్ట్ ను మీరు
నియమించుకోవాల్సి ఉంటుంది. ఫార్మసిస్ట్ గా మీరు కౌంటర్ వద్ద ఉన్నప్పుడు మీకు
మందులను సర్దడానికి, కౌంటర్ లో మందులు ఇవ్వడానికి, డిస్ట్రిబ్యూటర్ తో కొత్త మందులు
తెప్పించుకోవడం గురించి మాట్లాడానికి ఈ సిబ్బంది అవసరం.
డ్రగ్ లైసెన్స్ కోసం అవసరమైన ముఖ్యమైన పత్రాలు (Important documents for
Drug license)
డ్రగ్ లైసెన్స్ పొందడానికి సంబంధిత రాష్ట్ర డ్రగ్ లైసెన్స్ అథారిటీ వెబ్ సైట్ లో మీరు ఒక ఫామ్
పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి విభాగానికి వేర్వేరు ఫారాలు అందుబాటులో ఉంటాయి.
మెడికల్ స్టోర్ లో మీరు చిల్లర వ్యాపారం చేయడానికి ఫారమ్ 20 ద్వారా మీరు లైసెన్స్
పొందవచ్చు. మెడికల్ షాపు ప్రారంభించడానికి ఫారమ్ 20తో పాటు ఇతర ముఖ్యమైన
పత్రాలు అవసరం.
ఆధారం: ఔషధ నియంత్రణ విభాగం, ఢిల్లీ
డ్రగ్ లైసెన్స్ కు సంబంధించిన మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://delhi.gov.in/wps/wcm/connect/doit_drug/DoIT_Drug/Home/Procedure
s+For+Obtaining+Licences/
ఆ ఫామ్ తో పాటు కావాల్సిన ఇతర పత్రాలు ఇవి…
ఈ పత్రాలు 100 డీపీఐ సైజులో నలుపు, తెలుపు రంగులో ఉండాలి. దరఖాస్తుదారులు వాటిని
స్కాన్ చేసి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు వీటి అసలు పత్రాలను కలిగి
ఉండాలి. తనిఖీ సమయంలోవాటిని చూపించాల్సి ఉంటుంది.
● దరఖాస్తుదారుడి గురించి అవసరమైన సమాచారాన్ని తెలిపే కవర్ లెటర్
తప్పనిసరి. దరఖాస్తుదారుడి హోదా, దరఖాస్తు ఎందుకు పూరించాల్సి వచ్చింది,
ఎవరి పేరు మీద పూరించాల్సి వచ్చింది వివరాలు తెలుసుకోవడానికి ఈ కవర్
లెటర్ అవసరం.
● అద్దె ఒప్పందం/ఫార్మసీ యాజమాన్య పత్రం.
● ప్రకటన ఫారమ్.
● డ్రగ్ లైసెన్స్ కోసం మీరు చెల్లించిన రుసుము రశీదు.
● రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండీషనర్, విద్యుత్తు బిల్లులు మొదలైనవి.
● ఇన్ కార్పొరేషన్ సర్టిఫికెట్, ఏంఏ, ఎమ్ఓఏ అసలైన పత్రాలు
● రిజిస్టర్డ్ ఫార్మాసిస్ట్ లేదా తగిన అర్హతలున్న వ్యక్తి యొక్క ఉద్యోగ నియామక
పత్రం (డ్రగ్స్, కాస్మోటిక్స్ చట్టం, 1940 నిబంధనల ప్రకారం)
● ఆస్తి పన్ను రశీదు
● రూ.2 స్టాంపులు (4 కాపీలు)
మార్కెటింగ్ ఎలా చేయాలి? (How to do marketing)
చిన్న తరహా, పెద్ద తరహా వ్యాపారాల వృద్ధికి మార్కెటింగ్ అనేది చాలా అవసరం. చాలా మంది
కస్టమర్లకు చేరువ కావడానికి మీకు సరిపోయే మార్కెటింగ్ ఆలోచనలను మీరు వ్యాపారంలో
అమలు చేయాల్సి ఉంటుంది. మందుల వ్యాపారానికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అయితే
మీ పోటీదారులతో పోటీపడి మీరు మీ వ్యాపార సేవలు అందిస్తారనేదానిపైనే మీ వ్యాపారాభివృద్ధి
ఆధారపడి ఉంటుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధికి మీరు ఈ మూడు విషయాలు
గుర్తుంచుకోండి. షాపు గురించి ప్రచారం, కస్టమర్లతో మీ ప్రవర్తన, కస్టమర్లకు అందించే
ప్రయోజనాలు.
ప్రచారం (Advertisement) – మీ షాపు గురించి మీరు ఆన్ లైన్ , ఆఫ్ లైన్ లో ప్రచారం
చేసుకోవడానికి చాలా మార్గాలున్నాయి.
ఆన్ లైన్ ప్రచారం (Online Advertisement)
గూగుల్ మై బిజినెస్ (Google My Business) – గూగుల్ మై బిజినెస్ అనేది గూగుల్
రూపొందించిన ఒక అప్లికేషన్(టూల్). అక్కడ గూగుల్ లిస్టింగ్ లో మీరు మీ వ్యాపారాన్ని
నమోదు చేయవచ్చు. ఎవరైనా తమకు దగ్గర్లో ఉన్న కెమిస్ట్ షాపు కోసం లేదా మీ షాపు
కోసం ఆన్ లైన్ లో వెతికితే, వాళ్లకు గూగుల్ సెర్చ్ లో మీ షాపు వివరాలు సులభంగా
తెలుసుకునే అవకాశం ఉంది.
గూగుల్ మై బిజినెస్ మీ దుకాణం పేరు, మార్గం, ఫోన్ నెంబర్, సమీక్షలు, రేటింగ్స్, ఫొటోల
వివరాలన్నీ ఒకేచోట చూపిస్తుంది. ఇది వినియోగదారులకు సులభతరం అవుతుంది. ఆన్
లైన్ లో మీ షాపు వివరాలు పొందుపరచడం సులభం. ఆన్ లైన్ లో కెమిస్ట్ షాపు వివరాలు
వెతికేవారికీ ఇది ఉపయోగపడుతుంది. గూగుల్ మై బిజినెస్ లో మీ ఖాతాను తెరవడం
సులభం. కింద తెలిపిన విధానంలో మీరు ఖాతా తెరవవచ్చు.
To know more about Google My Business
గూగుల్ మై బిజినెస్ గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
https://www.google.com/intl/en_in/business
జస్ట్ డయల్ (Just Dial) – మీరుండే ప్రాంతంలో నిర్వహిస్తున్న స్థానిక వ్యాపారాలకు
సంబంధించిన సమాచారాన్ని అందించే వేదికే జస్ట్ డయల్. దీనికి సంబంధించిన సమాచారం
ఆన్ లైన్ లో తెలుసుకోవచ్చు లేదా కస్టమర్ కేర్ నెంబర్ కు ఫోన్
చేయవచ్చు(8888888888).
గూగుల్ మై బిజినెస్ లో మాదిరి జస్ట్ డయల్ లో కూడా మీరు మీ వ్యాపారాన్ని రిజిస్టర్
చేసుకోవచ్చు. జస్ట్ డయల్ లో మీరు రెండు విధాలుగా మీ వ్యాపార వివరాలు నమోదు
చేసుకోవచ్చు. ఒకటి ఉచిత నమోదు రెండోది చెల్లింపు నమోదు.
జస్ట్ డయల్ లో ఉచిత నమోదు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
https://www.justdial.com/Free-Listing
చెల్లింపు నమోదు కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://www.justdial.com/advertise
ఆఫ్ లైన్ ప్రచారం (Offline Advertisements)
హోర్డింగ్స్ (Hoardings) – మందుల వ్యాపారం ఎక్కువగా ఆఫ్ లైన్ లో జరుగుతుంది కాబట్టి
ఆఫ్ లైన్ ప్రచారం చేయడం ముఖ్యం.
హోర్డింగ్ ఏర్పాటు చేయాలనుకునేటపుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవి…
మీరు మందుల దుకాణం ప్రారంభించడానికి వారం ముందు ఆ ప్రాంతంలో ఒక హోర్డింగ్
పెట్టండి. దాంతో ప్రజలు ఆ ప్రాంతంలో కొత్త దుకాణం ప్రారంభం కాబోతుందని తెలుసుకుంటారు.
● రద్దీ ప్రాంతాల్లో మీరు మీ హోర్డింగ్ పెట్టవచ్చు. మార్కెట్లు, బస్టాండ్లు,
ఆసుపత్రులు, ఆసుపత్రుల దగ్గరి ప్రాంతాల్లో హోర్డింగ్ పెట్టడం లాభం
చేకూరుస్తుంది.
● కర పత్రాలు ( Pamphlets) – చుట్టు పక్కల ప్రాంతాలో మీరు కర పత్రాలు
పంపిణీ చేయవచ్చు. ఈ తరహా ప్రచారంలో మీ షాపు గురించి ఎక్కువ మందికి
తెలుస్తుంది.
● యెల్లో పేజీస్ (Yellow Pages) – యెల్లో పేజీలనేది ఒక డైరెక్టరీ లాంటిది.
అందులో అన్ని రకాల వ్యాపారాలకు సంబంధించిన ఫోన్ నెంబర్లు,
చిరునామాలు ఉంటాయి. యెల్లో పేజీల గురించి మరింత తెలుసుకోవడానికి,
అందులో రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
● http://www.indiamarketplaces.com/register.p
ప్రవర్తన (Behaviour) – ప్రవర్తన గురించి ఒక అద్బుతమైన మాట చెప్పబడింది.
మనస్సును రంజింపచేసేలా మాట్లాడాలి.
అదెలా ఉండాలంటే అవతలివాళ్లు సంతోషించాలి..మీరూ సంతోషించాలి.
వినియోగదారులతో ఎలా మాట్లాడాలంటే మీ సేవలు, మాటతీరు చక్కగా ఉన్నాయని వాళ్లు
భావించి వాళ్లు తిరిగి మీ దుకాణానికి వచ్చేలా ఉండాలి. వాళ్లతో చక్కగా మాట్లాడండి. మంచి
సేవలు అందించండి. ఈ విధంగా మీరు మీ షాపుకు సొంత బ్రాండ్(పేరు) సంపాదించుకోవచ్చు
కూడా. ఇలా జరిగితే మీ సేవలు పొందిన ప్రజలు మీ షాపులో మందులు కొనమని ఇతరులకు
సూచిస్తారు.
వినియోగదారుల ప్రయోజనాలు (Customers benefits) – వినియోగదారులకు అందించే
సేవల మీద మీరు ఎంత దృష్టి పెడితే మీరు తిరిగి అంత ప్రతిఫలం పొందుతారు. ఈ
సందర్భంగా మీరు ఈ విషయాలు గుర్తుంచుకోండి.
అంతరాయాలు లేని సేవలు అందించండి. ఈ విధంగా మీరు వినియోగదారులను
ఆకర్షించవచ్చు.
ఇతర మందుల షాపులతో పోలిస్తే వినియోగదారులకు అదనపు సర్వీసులు అందించండి.
ఉదాహరణకు ఇంటి వద్దకే బట్వాడా, జనరిక్ మందుల అమ్మకం. మీరు ఆరోగ్యానికి
సంబంధించిన ఆహార పదార్థాలను కూడా అమ్మకానికి ఉంచవచ్చు.
మీ దుకాణానికి వచ్చే వినియోగదారులను గౌరవించండి అలాగే వీలైనంత త్వరగా వాళ్లకు
సేవలు అందించండి. ఏ వినియోగదారుడు తాను సేవలు పొందడానికి వేచి చూడాలని
అనుకోడు.
ఇతర షాపులతో పోల్చి చూస్తే మీరు ఎక్కువ రాయితీలు అందజేయవచ్చు. దీని వల్ల మీకు
వినియోగదారులు పెరుగుతారు.
మీ షాపులో అందజేసే ఆఫర్లు, రాయితీల గురించి వినియోగదారులకు తెలియజేయండి. ఆ
వివరాలతో మీరు ఒక బోర్డు ఏర్పాటు చేయవచ్చు.
● తగినంత బిల్లు చెల్లించిన కస్టమర్లకు మీరు రాయితీ ఇవ్వవచ్చు. వారికి మీరు ఒక
కూపన్ అందజేయడం ద్వారా మీ అమ్మకాలను పెంపొందించుకోవచ్చు.
● చెల్లింపులు చేసే విధానం కూడా ముఖ్యమైన విషయం. డిజిటల్ చెల్లింపులు, ఆన్ లైన్
చెల్లింపులను మీరు అంగీకరించాల్సి ఉంటుంది. ఇది మీకు, కస్టమర్లకు సౌకర్యవంతంగా
ఉంటుంది.
మీకు అవసరమైన సమాచారమంతా ఈ వ్యాసంలో ఇవ్వడానికి మేము ప్రయత్నించాం. భారత్
లో మందుల వ్యాపారం ఎలా ప్రారంభించాలనే విషయాన్ని గురించి మీకు ఒక సమగ్ర
ఆలోచనను ఈ వ్యాసం అందించి ఉంటుందని మేము భావిస్తున్నాం. మరింత సమాచారం
కోసం మీరు కింద ఇక్కడ వ్యాఖ్యానించవచ్చు.