ndian army female recruitment bharti 2019 ki jaankari

భార‌త సైన్యంలో మ‌హిళల రిక్రూట్‌మెంట్ 2019 వివ‌రాలు 

భారతదేశ‌ సైన్యంలో పని చేయాల‌నేది కొంద‌రు మహిళలకు కల. 1992 లో మొద‌టి మహిళ అధికారి కేడ‌ర్లోకి ప్ర‌వేశించి చ‌రిత్ర సృష్టించింది. అయితే ఇప్ప‌టికీ ఆర్మీలోని ఇన్ఫాంట్రీ ఆర్మర్డ్ కార్ప్, మెకానిజమ్, పదాతి దళ వంటి పోరాట విభాగాలలో మహిళ‌లు చోటు క‌ల్పించ‌లేదు. ఇప్పటి వరకు 1200 మంది మ‌హిళ‌లు భారత సైన్యంలో అధికారులుగా నియ‌మితుల‌య్యారు. మహిళలు సైన్యంలో ఉద్యోగం చేయాలంటే క‌నీసం డిగ్రీ పాసై ఉండాలి.

భార‌త సైన్యంలో ఉద్యోగినుల భ‌ర్తీ రెండు విధాలుగా ఉంటుంది.

అధికారిణి స్థాయి పోస్టులకు ద‌ర‌ఖాస్తుల చేసుకోవాలంటే డిగ్రీ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.

ఉమెన్ ఆర్మీ జ‌న‌ర‌ల్ డ్యూటీ సోల్జ‌ర్‌(మిల‌ట‌రీ పోలీస్‌) కేటగిరీలో 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఆల్ ఇండియా స్థాయి ఉద్యోగాల‌కు ప‌దో త‌ర‌గ‌తి పాస్ అయి ఉండాలి. వ‌య‌స్సు 17.5 నుంచి 21 ఏళ్ల మ‌ధ్య‌లో ఉండాలి.

ఇండియ‌న్ ఆర్మీలో చేరాల‌నుకుంటే కింది ఆర్మీ ఫిమేల్ భ‌ర్తీ 2019-2020 ఫేస్ బుక్ గ్రూప్‌లో చేరండి. దాని కోసం కింది బ‌ట‌న్‌ను నొక్కండి.

తాజా స‌మాచారం కోసం మా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనుస‌రించండి

ఇండియన్ ఆర్మీ ఉమెన్ రిక్రూట్‌మెంట్ లో భాగంగా మహిళలు ఈ కింది పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

జ‌న‌ర‌ల్ డ్యూటీ సోల్జ‌ర్ (మిల‌ట‌రీ పోలీస్) పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి జూన్ 30 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఎస్సెస్సీ ఆఫీస‌ర్ ఆర్మీ డెంట‌ల్ కార్ప్స్ 2019 నోటిఫికేష‌న్ విడుద‌లైంది.

ప్రాదేశిక‌ ఆర్మీ పోస్టుల భ‌ర్తీ 2019 ప్రారంభ‌మైంది. పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

ఎస్సెస్సీ ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ 2019

జ‌డ్జ్ అడ్వొకేట్ జ‌న‌రల్ (జేఏజీ) 2019

షార్ట్ స‌ర్వీస్ క‌మీష‌న్ నాన్ టెక్నిక‌ల్ ఉమెన్ 2019

షార్ట్ స‌ర్వీస్ క‌మీష‌న్ (టెక్నిక‌ల్‌) ఉమెన్ 2019

మిల‌ట‌రీ న‌ర్సింగ్ స‌ర్వీస్ 2019

ఇండియ‌న్ ఆర్మీ మ‌హిళా రిక్రూట్ మెంట్ 2019

ఈ ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి మీకు ఏవైనా సందేహాలుంటే మా ఫేస్ బుక్ గ్రూపులో జాయిన్ అవ్వండి. మీ ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు తెలుసుకోండి. గ్రూపులో జాయిన్ కావ‌డానికి ఇక్క‌డ కింద క్లిక్ చేయండి.

ఇండియ‌న్ ఆర్మీ ఫిమేల్ భ‌ర్తీ 2019-20 ఫేస్ బుక్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఈ గ్రూప్‌లో జాయిన్‌ అవ్వండి.

ఇండియ‌న్ ఆర్మీలో మ‌హిళ‌ల భ‌ర్తీకి సంబంధించిన కొన్ని ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు

ప్ర‌.1) ప‌దో త‌ర‌గ‌తి పాసైన మ‌హిళ‌లు సైన్యంలో చేర‌వ‌చ్చా?

జ‌) మ‌హిళ‌లు లేదా బాలిక‌లు భార‌త సైన్యంలో చేరాలంటే క‌నీసం డిగ్రీ పాసై ఉండాలి. 

మొద‌టిసారి ప‌దో త‌ర‌గ‌తి పాసైన మ‌హిళ‌లు మిల‌ట‌రీ పోలీస్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి 2019లో అవ‌కాశం క‌ల్పించారు. దీని గురించి మ‌రిన్ని వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి.

ఇండియ‌న్ ఆర్మీ ఉద్యోగినుల భ‌ర్తీ 2019 (మిల‌ట‌రీ పోలీస్‌)


2) మ‌హిళ‌లు సైనిక నియామ‌క ర్యాలీలో పాల్గొన‌వ‌చ్చా?

జ‌) మ‌హిళ‌లు ఆఫీస‌ర్ స్థాయి ఉద్యోగాల‌కు మాత్ర‌మే అర్హులు. సైనిక నియామ‌క ర్యాలీలో పాల్గొనేందుకు వారికి అర్హ‌త లేదు.

ప్ర‌. 3) ఇండియ‌న్ ఆర్మీలో ప‌ర్మినెంట్, షార్ట్ స‌ర్వీస్ క‌మీష‌న్ అర్థాలు ఏమిటి?

జ‌. ఇండియ‌న్ ఆర్మీలో రెండు ర‌కాల స‌ర్వీసులుంటాయి. 

ప‌ర్మినెంట్ స‌ర్వీస్ క‌మీష‌న్

ప‌ర్మినెంట్ స‌ర్వీస్ క‌మీష‌న్ అంటే ఉద్యోగ విర‌మ‌ణ చేసే వ‌ర‌కు ఆర్మీలోనే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

షార్ట్ స‌ర్వీస్ క‌మీష‌న్ (ఎస్సెస్సీ)

షార్ట్ స‌ర్వీస్ క‌మీష‌న్ (ఎస్సెస్సీ) అంటే ఇందులో 14 ఏళ్ల స‌ర్వీసు ఉంటుంది. ఇందులో మొద‌టి ప‌దేళ్ల స‌ర్వీస్ త‌ర్వాతి 4 ఏళ్ల స‌ర్వీసుకు పొడిగింపుగా ఉంటుంది. 

ప్ర‌.4) ఇండియ‌న్ ఆర్మీ ఉద్యోగాల కోసం మ‌హిళ‌లు ఎక్క‌డ ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి?

జ‌. అన్ని ర‌కాల పోస్టుల‌కు ఇండియ‌న్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లోనే అప్ల‌య్ చేసుకోవాలి.

ప్ర‌.5) ఆర్మీ ఉద్యోగినుల భ‌ర్తీకి సంబంధించి క‌నీస ఎత్తు, బ‌రువు ఎంత ఉండాలి.

జ‌వాబు – ఆర్మీ ఉద్యోగాల‌కు సంబంధించి క‌నీస ఎత్తు, బ‌రువు ఉండాలి. 

ఉద్యోగార్హ‌త‌ల్లో ఎత్తు, బ‌రువు ఎంత ఉండాలో స‌రి చూసుకోండి.

ఎత్తు (సెం.మీల‌లో)
బ‌రువు కేజీల్లో  (ఏళ్ల వారీగా వ‌య‌స్సు వివ‌రాలు)


20-2526-30
148-151 43-4546-48
152-15546-4849-51
156-16049-5152-55
161-16552-5455-58
166-171 55-58 59-62
172-176  59-61 63-66
177-17862-63

ప్ర‌.6) ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూలో ముఖ్యంశాలేమిటి?

జ‌. షార్ట్ స‌ర్వీస్ బోర్డ్‌(ఎస్ఎస్‌బీ) ఇంట‌ర్‌వ్యూ:  షార్ట్ లిస్టు అయిన‌ అభ్య‌ర్థులు ఆర్మీలో జాయిన్ కావాలంటే ఎస్సెస్బీ ఇంట‌ర్వ్యూ క్లియ‌ర్ చేయాలి. ఈ ఇంట‌ర్‌వ్యూ అయిదు రోజుల‌పాటు జ‌రుగుతుంది. ఇందులో స్క్రీనింగ్‌, సైకాల‌జీ టెస్టు, గ్రూప్ టాస్క్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ మ‌రియు కాన్ఫ‌రెన్స్ ఉంటాయి. ఈ ఇంట‌ర్ వ్యూలు మొత్తం నాలుగు న‌గ‌రాల్లో జ‌రుగుతాయి. అవి అల‌హాబాద్‌, బెంగ‌ళూరు, బొఫాల్‌, క‌పుర్త‌లా.

ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ విధానం పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

ప్ర‌.6) మ‌హిళా ఆర్మీ రిక్రూట్ మెంట్లో మెడిక‌ల్ టెస్ట్ ఎక్క‌డ నిర్వ‌హిస్తారు?

జ‌. ఎస్సీస్బీ ఇంట‌ర్వ్యూ పూర్త‌య్యాక మెడిక‌ల్ టెస్టు పాస‌వ‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ మెడిక‌ల్ టెస్టు కింది 8 ఆసుప‌త్రుల్లో నిర్వ‌హిస్తారు.

బేస్ హాస్పిట‌ల్, ఢిల్లీ కంటోన్మెంట్

క‌మాండ్ హాస్పిట‌ల్, సౌత్ర‌న్ క‌మాండ్‌, పూణె

క‌మాండ్ హాస్పిట‌ల్, ఈస్ట్ర‌న్‌ క‌మాండ్‌, కోల్‌క‌తా

క‌మాండ్ హాస్పిట‌ల్, సెంట్ర‌ల్‌ క‌మాండ్‌, ల‌క్నో

క‌మాండ్ హాస్పిట‌ల్, వెస్ట్ర‌న్‌ క‌మాండ్‌, చండీమందిర్‌

క‌మాండ్ హాస్పిట‌ల్, ఎయిర్ ఫోర్స్, బెంగ‌ళూరు

క‌మాండ్ హాస్పిట‌ల్, నాత్ర‌న్ క‌మాండ్‌, కేరాఫ్ 56 ఏపీఓ.

ఐఎన్‌హెచ్‌, అశ్విని, ముంబ‌యి

మెడిక‌ల్ టెస్టుకు సంబంధించిన పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

భార‌త సైన్యం మ‌హిళల రిక్రూట్‌మెంట్ 2019

1. మ‌హిళా జ‌న‌ర‌ల్ డ్యూటీ సోల్జ‌ర్ 2019 ఆల్ ఇండియా

ముఖ్య‌మైన సూచ‌న – ఆన్‌లైన్ అప్లికేష‌న్ ఫామ్ పూర్తి చేయ‌డానికి ఆఖ‌రి రోజు పొడిగించబడింది. జూన్ 30 తేదీ వ‌ర‌కు అప్లికేష‌న్ పూరించ‌వ‌చ్చు. ఈ అవ‌కాశం భార‌తీయ మ‌హిళ‌ల‌కు మాత్రమే వ‌ర్తిస్తుంది. ఈ ఏడాది (2019) జులై, ఆగ‌స్ట్, సెప్టెంబ‌ర్ ల‌లో అంబ‌లా, ల‌ఖ్‌న‌వూ, జ‌బ‌ల్‌పూర్ , బెంగ‌ళూరు, షిల్లాంగ్‌ల‌లో మెయిన్స్ నిర్వ‌హించ‌బ‌డుతుంది. 

భార‌త సైన్యంలో మ‌హిళా సైనికుల పోస్టులు 100 ఖాళీ ఉన్నాయి.

భార‌త సైన్యంలో ఉద్యోగాల‌కు ప‌దో త‌ర‌గ‌తి పాసైన మ‌హిళ‌లు అర్హులు : 

మ‌హిళా జ‌న‌ర‌ల్ డ్యూటీ సైనికులు (మిల‌ట‌రీ పోలీస్‌) పోస్టుకు కావాల్సిన అర్హ‌త‌లు

వ‌యో ప‌రిమితి శారీర‌క సామ‌ర్థ్యం విద్యార్హ‌తఎంపిక విధానం

  17.5 నుంచి 21 ఏళ్ల  మ‌ధ్య వ‌య‌స్కులై ఉండాలి. (01 అక్టోబ‌ర్ 1998 నుంచి 01 ఏప్రిల్ 2002 మ‌ధ్య‌లో పుట్టిన‌వారై ఉండాలి)పెళ్లి కాని మ‌హిళ‌లు లేదా విధ‌వ‌లు లేదా పిల్ల‌లు లేని విడాకులు తీసుకున్న మ‌హిళ‌లుఎత్తు – 142 సెంటి మీట‌ర్లు బ‌రువు – సైన్యం ప్ర‌మాణాల ప్ర‌కారం ఎత్తుకు త‌గ్గ‌ట్లు బ‌రువు ఉండాలి.
45% మార్కుల‌తో ప‌దో త‌ర‌గ‌తి పాసై ఉండాలి. ప్ర‌తి స‌బ్జెక్టులోనూ 33% మార్కులు వ‌చ్చి ఉండాలి.మార్కుల ఆధారంగా అభ్య‌ర్థుల తుది జాబితా త‌యారు చేస్తారుశారీర‌క దారుఢ్య ప‌రీక్ష నిర్వ‌హిస్తారువైద్య ప‌రీక్ష నిర్వ‌హిస్తారుసీఈఈ ఎంట్ర‌న్స్ నిర్వ‌హిస్తారు

ఆన్‌లైన్ ఫామ్ ఎలా నింపాలి?

2019-20 ఎస్సెస్సీ ఎన్సీసీ స్పెష‌ల్ ఎంట్రీ, ఎస్సెస్సీ జేఏజీ, మిల‌ట‌రీ న‌ర్సింగ్ పోస్టుల ద‌ర‌ఖాస్తులు తేదీలు వెలువ‌డ్డాయి. మిగ‌తా పోస్టుల నోటిఫికేష‌న్ ఇంకా రాలేదు. నోటిఫికేష‌న్ అప్ డేట్స్ కోసం మా ఫేస్ బుక్ గ్రూప్‌లో చేరండి.

ఆన్‌లైన్ లో అప్ల‌య్ చేసే విధానం

స్టెప్ 1 – ఆర్మీ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి జేసీఓ/ఓఆర్ ఎన్‌రోల్‌మెంట్ లో అర్హ‌త ప‌రిశీలించుకోవ‌డం కోసం క్లిక్ చేయండి.

స్టెప్ 2- అర్హ‌త స‌రిచూసుకున్నాక అప్ల‌య్ బ‌ట‌న్ మీద క్లిక్ చేయండి. అక్క‌డొక ఫార‌మ్ క‌నిపిస్తుంది.

స్టెప్ 3- ద‌రఖాస్తు నింప‌డానికి ముందు రిజిస్ట్రేష‌న్ చేసుకోండి. మీరు ఇంత‌కు ముందే రిజిస్ట్రేష‌న్ చేసుకుని ఉంటే రిజిస్ట్ర‌ర్డ్ కాల‌మ్‌లోకి వెళ్లండి. మొద‌టిసారి రిజిస్ట్రేష‌న్ చేసుకుంటున్న‌ట్ల‌యితే న్యూ రిజిస్ట్రేష‌న్ కాల‌మ్ లోకి వెళ్లి రిజిస్ట‌ర్ చేసుకోండి.

నోట్ – వివ‌రాల‌న్నీ స‌రిగా నింపండి. మీ అధికారిక డాక్యుమెంట్ల‌లో ఉన్న వివ‌రాల‌నే ద‌ర‌ఖాస్తులో పేర్కొనండి. మీరు ఏ వివ‌రాలైనా త‌ప్పుగా న‌మోదు చేస్తే మీ ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతుంది.

కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (సీఈఈ) ద్వారా రాత ప‌రీక్ష‌

(ఎ) మెడిక‌ల్ ఫిట్ నెస్ ఉన్న అభ్య‌ర్థుల‌కు వారికి కేటాయించిన న‌గ‌రంలో సీఈఈ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష జ‌రిగే స్థ‌లం, తేదీ, స‌మ‌యం, అడ్మిట్ కార్డు వివ‌రాలు ఆర్మీ వెబ్‌సైట్లో అప్‌డేట్ చేస్తారు.

(బి) బేస్ హాస్పిట‌ల్/ఆర‌్మీ ఆసుప‌త్రి/క‌మాండ్ ఆసుప‌త్రికి చెందిన స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ క‌న్‌ఫ‌ర్మ్ చేసిన రివ్యూ ఫిట్ కేస్ అభ్య‌ర్థుల‌కు కూడా అడ్మిట్ కార్డు ట్యాబ్ కేటాయించ‌బ‌డుతుంది.

(సి) సీఈఈ మెయిన్స్ లో నెగ‌టివ్ మార్కింగ్ ఉంటుంది. త‌ప్పు స‌మాధానాలు రాసిన‌వారికి మార్కులు కేటాయించ‌బ‌డ‌తాయి.

(డి) సీఈఈ ప‌రీక్ష ఫ‌లితాలు అధికారిక వెబ్ సైట్ అయిన joinindianarmy.nic.in లో ప్ర‌క‌టిస్తారు. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ప్ర‌త్యేకంగా ఎలాంటి లెట‌ర్ పంపించ‌బ‌డ‌దు.

(ఈ) సీఈఈ 2019 ప‌రీక్ష‌లో మూడు టాపిక్స్ మీద ప్ర‌శ్న‌లు అడుగుతారు. అవి జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, జ‌న‌ర‌ల్ సైన్స్, గ‌ణితం

మ‌హిళా సైనికుల భ‌ర్తీకి సంబంధించిన ముఖ్య‌మైన డాక్యుమెంట్లు

  • అడ్మిట్ కార్డు – నాణ్య‌త క‌లిగిన పేప‌ర్ మీద అడ్మిట్ కార్డ్ ప్రింట‌వుట్ తీసుకోవాలి.
  • ఫొటోగ్రాఫ్ – తెలుపు, న‌లుపు బ్యాక్ గ్రౌండ్ క‌లిగిన రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలు జ‌త చేయాలి. మూడు నెల‌ల కంటే పాత ఫొటోలు జ‌త చేయ‌కూడ‌దు.
  • విద్యార్హ‌త ప‌త్రాలు- గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివ‌ర్సిటీ జారీ చేసిన ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్లు ఉండాలి. ప్రొవిజిన‌ల్ స‌ర్టిఫికెట్ల‌యితే స్కూల్/కాలేజీ ప్రిన్సిప‌ల్ సంత‌కం ఉండాలి. ఓపెన్ స్కూల్లో మెట్రిక్ పాస‌యిన‌వారు బీఈవో / డీఈవో జారీ చేసిన స్కూల్ లీవింగ్ స‌ర్టిఫికెట్ క‌లిగి ఉండాలి.
  • శాశ్వ‌త నివాస ధ్రువీక‌ర‌ణ ప‌త్రం – త‌హ‌సీల్దార్ లేదా జిల్లా మెజిస్ట్రేట్ జారీ చేసిన ఫోటోతో కూడిన శాశ్వ‌త ధ్రువీక‌ర‌ణ ప‌త్రం ఉండాలి. 
  • మ‌త ధ్రువీక‌ర‌ణ ప‌త్రం – త‌హ‌సీల్దార్ లేదా ఎస్డీఎమ్ జారీ చేసిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రం ఉండాలి. (సిక్కు/క‌్రిస్టియ‌న్‌/హిందూ /ముస్లిం మ‌త‌స్థులైతే కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రంలో మ‌తం గురించి పేర్కొనాల్సిన అవ‌స‌రం లేదు.) 
  • స్కూల్ క్యారెక్ట‌ర్ స‌ర్టిఫికెట్ – చివ‌ర‌గా చ‌దివిన పాఠ‌శాల నుంచి స్కూల్ క్యారెక్ట‌ర్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించాలి. ఆ స్కూల్ హెడ్ మాస్ట‌ర్ లేదా ప్రిన్సిప‌ల్ సంత‌కం స‌ర్టిఫికెట్ మీద ఉండాలి.
  • క్యారెక్ట‌ర్ స‌ర్టిఫికెట్ – ఫొటోతో కూడిన క్యారెక్ట‌ర్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించాలి. గ్రామ స‌ర్పంచి లేదా మున్సిప‌ల్ కార్పొరేట‌ర్ గ‌త ఆరు నెల‌ల‌లోపు జారీ చేసిన స‌ర్టిఫికెట్ అయి ఉండాలి.
  • ఎన్‌సీసీ స‌ర్టిఫికెట్ – ఎన్ సీసీ ఏ/బీ/సీ స‌ర్టిఫికెట్స్ 
  • రిలేష‌న్‌షిప్ స‌ర్టిఫికెట్ – స‌ర్వీసులో ఉన్న ఉద్యోగి కూతురి స‌ర్టిఫికెట్ (డీఓఎస్‌), మాజీ ఉద్యోగి కూతురు (డీఓఈఎక్స్), యుద్ధ విధ‌వ కూతురు(డీఓడ‌బ్ల్యూడ‌బ్ల్యూ), మాజీ ఉద్యోగి భార్య(విధ‌వ‌రాలైనవాళ్లు) కూతురు (డీఓడ‌బ్ల్యూ) లో సంబంధిత స‌ర్టిఫికెట్ ఏదో ఒక‌టి స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.
  •  పెళ్లి కాలేద‌ని తెలిపే ధ్రువీక‌ర‌ణ ప‌త్రం – ఈ ఉద్యోగానికి ద‌ర‌ఖాస్తు చేసేవారు అవివాహితులై ఉండాలి. అవివాహిత అని తెలిపే స‌ర్టిఫికెట్ జిరాక్స్ కాపీని ద‌ర‌ఖాస్తుకు జ‌త చేయాలి. గ్రామ స‌ర్పంచ్ లేదా మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ గ‌త 6 నెల‌ల‌లోప‌ల ఈ స‌ర్టిఫికెట్ జారీ చేసి ఉండాలి.

పెళ్ల‌యిన అభ్య‌ర్థినులు

(1) విధ‌వ‌లు, విడాకులు తీసుకున్న‌వారు లేదా న్యాయ‌ప‌రంగా విడిపోయిన‌వారు ఈ ఉద్యోగానికి అర్హులు. అయితే వీళ్ల‌కు పిల్ల‌లు ఉండ‌కూడ‌దు.

(2) ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన విధ‌వ‌లు మ‌హిళా మిల‌ట‌రీ పోలీస్ ఉద్యోగానికి అర్హులు. వీళ్ల‌కు పిల్ల‌లు ఉన్నా ప‌ర్లేదు. అయితే మ‌రోసారి పెళ్లి చేసుకుని ఉండ‌కూడ‌దు.

(3) శిక్ష‌ణ కాలంలో పెళ్లి జ‌రిగితే – శిక్ష‌ణ‌కు ఎంపికైనవారు అది పూర్త‌య్యేవ‌ర‌కు పెళ్లి చేసుకోకూడ‌దు. ఒక‌వేళ‌

ఎవ‌రైనా ద‌ర‌ఖాస్తు చేసుకున్నాక పెళ్లి చేసుకుని ప‌రీక్ష రాసి పాస్ అయినా, మెడిక‌ల్ టెస్ట్ క్లియ‌ర్ చేసినా అలాంటి వాళ్ల‌ను ట్రైనింగ్ కు ఎంపిక చెయ్య‌రు. ఎవ‌రైనా శిక్ష‌ణ స‌మ‌యంలో పెళ్లి చేసుకున్నా, పెళ్ల‌యిన విష‌యం దాచి పెట్టినా అలాంటి వారిని ఉద్యోగం నుంచి తొల‌గిస్తారు. 

సింగిల్ బ్యాంక్ అకౌంట్‌, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ స‌మ‌ర్పించాలి.

మ‌హిళా జ‌న‌ర‌ల్ డ్యూటీ సోల్జ‌ర్ (మిల‌ట‌రీ పోలీస్) భ‌ర్తీ 2019 నోటిఫికేష‌న్ ఇక్క‌డ చూడండి.

భార‌త సైన్యం మ‌హిళా సైనికుల భ‌ర్తీ 2019కి సంబంధించిన వివిధ సందేహాల‌కు కావాల్సిన స‌మాధానాల‌ను ఈ వీడియోలో చూడండి.

మ‌హిళా సైనిక ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి మీకు ఏమైనా సందేహాలుంటే మీరు మా ఫేస్‌బుక్ గ్రూపులో చేరి స‌మాధానాలు పొందండి. గ్రూపులో చేర‌డానికి ఇక్క‌డ కింద క్లిక్ చేయండి.

ఇక్క‌డ క్లిక్ చేసి భార‌త సైన్యం మ‌హిళా సైనికుల భ‌ర్తీ 2019-20 ఫేస్ బుక్ గ్రూపులో చేరండి.

తాజా స‌మాచారం కోసం మా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను అనుస‌రించండి.

భార‌త సైన్యంలో కింద పేర్కొన్న పోస్టుల‌కు గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.

ఇండియ‌న్ ఆర్మీ అధికారిణుల రిక్రూట్‌మెంట్ 2019 నోటిఫికేష‌న్ లో 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

2. ఎస్సెస్సీ ఎన్సీసీ స్పెష‌ల్ ఎంట్రీ 2019

ఇండియ‌న్ ఆర్మీలో ఏటా రెండు సార్లు రిక్రూట్‌మెంట్ జ‌రుగుతుంది. ఇంకా పెళ్లి చేసుకోని మ‌హిళ‌లు (అవివాహితులు) మాత్ర‌మే ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు అర్హులు.

వ‌యో ప‌రిమితిశారీర‌క సామ‌ర్థ్యంవిద్యార్హ‌త‌లు

ఎంపిక ప్ర‌క్రియ‌
19 – 25 ఏళ్ల మ‌ధ్య‌లో  (02 జులై 1993 నుంచి 01 జులై 1999 మ‌ధ్య‌లో జ‌న్మించిన‌వాళ్లై ఉండాలి)

అవివాహితులు 
ఎత్తు 152 సెం.మీ,  బరువు 42 కేజీలు
50% మార్కుల‌తో డిగ్రీ పాసై ఉండాలి.
ఎన్‌సీసీ స‌ర్వీస్ – స‌ర్టిఫికెట్ సీ ప‌రీక్ష‌లో బి గ్రేడ్ తో పాసై క‌నీసం రెండేళ్లు ప‌నిచేసి ఉండాలి. 
తుది ఎంపిక‌
ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ (అల‌హాబాద్‌/బెంగ‌ళూరు/బఫాల్‌/క‌పుర్త‌లా)
వైద్య ప‌రీక్ష‌
  • ఎస్సెస్సీ ఉద్యోగ కాలం  14 ఏళ్లు (మొద‌ట ప‌దేళ్లు ఆ త‌ర్వాత 4 ఏళ్లు పొడిగింపు ఉంటుంది)
  • ఖాళీల సంఖ్య – 5 (జ‌న‌ర‌ల్ కేటగిరీ వారికి 4, సైన్యానికి చెందిన విధ‌వరాలికి 1), ఏడాదికి రెండుసార్లు
  • శిక్ష‌ణ కాలం- 49 వారాల ట్రైనింగ్‌, ట్రైనింగ్ అకాడ‌మీ ఓటీఏ చెన్నై (ఓటీఏ ట్రైనింగ్ టిప్స్)
  • ప్రొబెష‌న్ పిరియ‌డ్ – 6 నెలలు
  • ఓటీఏ ట్రైనింగ్ కిటుకులు

ఎస్‌సీసీడ‌బ్యూ ఆఫీస్ నోటిఫికేష‌న్ 2019 కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

3. ఎస్సెస్సీ జ‌డ్జ్ అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ (జేఏజీ) 2019

షార్ట్ స‌ర్వీస్ క‌మీష‌న్ ద్వారా పెళ్లి కాని న్యాయ‌శాస్త్ర ప‌ట్ట‌భ‌ద్రుల‌ను జ‌డ్జ్ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ గా  భార‌త సైన్యం నియ‌మించుకుంటుంది.

వ‌యో ప‌రిమితిశారీర‌క సామ‌ర్థ్యంవిద్యార్హ‌త‌లు
ఎంపిక ప్ర‌క్రియ‌
21-27 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్కులు(02-01-1992 నుంచి 1-1-1998 మ‌ధ్య జ‌న్మించిన‌వారై ఉండాలి)
అవివాహితులు
ఎత్తు – 152 సెంమీ
బ‌రువు – 42 కేజీలు
ఎల్ఎల్‌బీ డిగ్రీ క‌నీసం 55% మార్కుల‌తో పాసై ఉండాలి.
సంబంధిత రాష్ట్రం లేదా దేశ‌పు బార్ కౌన్సిల్ లో రిజిస్ట్రేష‌న్‌కు అర్హ‌త క‌లిగి ఉండాలి.
తుది ఎంపిక‌ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ (5 రోజులు) (అల‌హాబాద్/బెంగ‌ళూరు/బోఫాల్/క‌పుర్తలా)వైద్య పరీక్ష‌
  • ఎస్సెస్సీ ఉద్యోగ కాలం : 14 ఏళ్లు (మొద‌ట ప‌దేళ్లు ఆ త‌ర్వాత 4 ఏళ్లు పొడిగింపు ఉంటుంది)
  • ఖాళీల సంఖ్య – 7, ఏడాదికి రెండుసార్లు
  • శిక్ష‌ణ కాలం- 49 వారాల ట్రైనింగ్‌, ట్రైనింగ్ అకాడ‌మీ ఓటీఏ చెన్నై 
  • ప్రొబెష‌న్ పిరియ‌డ్ – 6 నెలలు
  • ఓటీఏ ట్రైనింగ్ కిటుకులు

అభ్యర్థులు ఎంపిక కేంద్రాల్లో కొన్ని డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఈ కాపీలను సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి.  ఎస్సెస్సీ ఇంటర్వ్యూలో ఒరిజినల్ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. వాటిని వెరిఫికేషన్ చేశాక తిరిగి ఇస్తారు. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్లు సమర్పించకపోతే మీ అప్లికేష న్ ను రద్దు చేస్తారు. కింది డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది.

(1)   ఫొటో అతికించి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి సంతకం చేసిన అప్లికేషన్ ఫారమ్

(2)   పదో తరగతి లేదా దానికి సమానమైన అర్హత కల విద్యార్హత సర్టిఫికెట్. వయసు ధ్రువీకరణ కోసం ఇది అవసరం. సంబంధిత బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీన్ని జారీ చేసి ఉండాలి.

(3)   12వ తరగతి మార్కుల లిస్టు

(4)   గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ప్రొవిజినల్ డిగ్రీ(డిగ్రీ తర్వాత చేసే మూడేళ్ల ఎల్ఎల్బీ విషయంలో). అభ్యర్థులు నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివిన తర్వాతే ఆన్లైన్ దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. లేకపోతే దరఖాస్తు తిరస్కరణకు గురై అవకాశం ఉంటుంది.

(5)   ఎల్ ఎల్ బీ డిగ్రీ/ప్రొవిజినల్ డిగ్రీ సర్టిఫికెట్ కాపీ

(6)   అన్ని సంవత్సరాల/సెమిస్టర్ల మార్కుల షీట్లు

(7)   బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/సంబంధిత రాష్ట్రం జారీచేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేదా కాలేజీ/యూనివర్సిటీ జారీ చేసిన సర్టిఫికెట్. ఈ సర్టిఫికెట్ జారీ చేసిన సంస్థ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొంది ఉండాలి.

జేఏజీ అధికారిక నోటిఫికేషన్ 2019 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4. యూపీఎస్సీ ఎస్సెస్సీ నాన్ టెక్నిక‌ల్ ఉమెన్ 2019

ఈ పోస్ట్ రిక్రూట్ మెంట్ యూపీఎస్సీ ద్వారా అవుతుంది. కాబ‌ట్టి ఈ ఉద్యోగానికి ద‌ర‌ఖాస్తు యూపీఎస్సీ వెబ్ సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. షార్ట్ స‌ర్వీస్ క‌మీష‌న్‌లో రెగ్యుల‌ర్ ఆర్మీలో ప‌నిచేసిన‌ట్లు 14 ఏళ్లు ఉండాలి. ఇందులో ప‌దేళ్లు స‌ర్వీస్ పీరియ‌డ్. నాలుగేళ్లు పొడిగింపు ఉంటుంది.

యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్

ఈ ఉద్యోగాల‌కు ఉండాల్సిన ఉద్యోగార్హ‌త‌లు

వ‌యో ప‌రిమితి శారీర‌క సామ‌ర్థ్యం విద్యార్హ‌త‌లుఎంపిక ప్ర‌క్రియ‌
19 – 25 ఏళ్ల మ‌ధ్య‌లో  (02 జులై 1993 నుంచి 01 జులై 1999 మ‌ధ్య‌లో జ‌న్మించిన‌వాళ్లై ఉండాలి)ఎత్తు 152 సెం.మీ,బరువు 42 కేజీలుగుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి.తుది ఎంపిక‌ఎస్సెబీ ఇంట‌ర్వ్యూ (5 రోజులు) (అల‌హాబాద్ /బెంగ‌ళూరు/ బోఫాల్ /క‌పుర్తలా)
వైద్య ప‌రీక్ష‌

  • ఎస్సెస్సీ వ‌యో ప‌రిమితి – 14 ఏళ్లు (మొద‌ట 10 ఏళ్లు ఆ త‌ర్వాత 4 ఏళ్లు పొడిగింపు)
  • ఖాళీలు – ఏడాదికి 12. (జ‌న‌ర‌ల్‌కు 11, సైన్యానికి చెందిన విధ‌వ‌ల‌కు 1), ఏడాదికి రెండు సార్లు
  • ఎస్ఎస్‌బీ తేదీలు – జ‌న‌వ‌రి/జులై /న‌వంబ‌ర్/డిసెంబ‌ర్
  • ట్రైనింగ్ – 49 వారాలు, చెన్నైలోని ట్రైనింగ్ అకాడ‌మీ ఓటీఏలో
  • ప్రొబేష‌న్ పిరియ‌డ్ – 6 నెల‌లు
  • ఓటీఏ ట్రైనింగ్ కిటుకులు

5. షార్ట్ స‌ర్వీస్ క‌మీష‌న్ (టెక్నిక‌ల్‌) మ‌హిళ‌లు 2019

భార‌త సైన్యంలో టెక్నిక‌ల్ పోస్టుల కోసం మ‌హిళ‌ల‌ను రిక్రూట్ మెంట్ చేసుకుంటారు. మ‌హిళా ఇంజినీర్ల పోస్టులు కూడా ఇలాగే భ‌ర్తీ చేస్తారు. 

టెక్నిక‌ల్ పోస్టులకు ఉండాల్సిన ఉద్యోగార్హ‌త‌లు

వ‌యో ప‌రిమితిశారీర‌క అర్హ‌త‌లువిద్యార్హ‌తఎంపిక ప్ర‌క్రియ‌
20-27 ఏళ్లు (జ‌న‌వ‌రి 2, 1992 నుంచి జ‌న‌వ‌రి 1, 1999 మ‌ధ్య జ‌న్మించిన‌వారై ఉండాలి)
పెళ్లి కాని మ‌హిళ‌లు
ఎత్తు – 152 సెం.మీబ‌రువు – 42 కేజీలు
గుర్తింపు పొందిన ప‌ద్ధ‌తిలో ఇంజినీరింగ్ (బీఈ/బీటెక్‌) డిగ్రీ షార్ట్ లిస్టింగ్‌ఎస్సెబీ ఇంట‌ర్వ్యూ (5 రోజులు) (అల‌హాబాద్/బెంగ‌ళూరు/బోఫాల్/క‌పుర్త‌లా)
వైద్య ప‌రీక్ష‌

  • ఎస్సెస్సీ వ‌యో ప‌రిమితి – 14 ఏళ్లు (మొద‌ట 10 ఏళ్లు ఆ త‌ర్వాత 4 ఏళ్లు పొడిగింపు)
  • ఖాళీలు – ఏడాదికి 15. (జ‌న‌ర‌ల్‌కు 14, సైన్యానికి చెందిన విధ‌వ‌ల‌కు 1), ఏడాదికి రెండు సార్లు
  • ఎస్ఎస్‌బీ తేదీలు – డిసెంబ‌ర్-జ‌న‌వ‌రి, జూన్-జులై
  • ట్రైనింగ్ – 49 వారాలు, చెన్నైలోని ట్రైనింగ్ అకాడ‌మీ ఓటీఏలో
  • ప్రొబేష‌న్ పిరియ‌డ్ – 6 నెల‌లు
  • ఓటీఏ ట్రైనింగ్ కిటుకులు

ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ విధానం పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

భార‌త సైన్యంలో టెక్నిక‌ల్ ఇంజినీర్ స‌ర్వీసు పోస్టుల కోసం మ‌హిళ‌ల‌ను రిక్రూట్మెంట్ చేసుకుంటారు. 

విభాగాలు(ఇంజ‌నీరింగ్ డిగ్రీ ఫీల్డ్స్‌)

సివిల్ ఇంజ‌నీరింగ్, సివిల్ ఇంజ‌నీరింగ్ (స్ట‌క్చ‌ర‌ల్‌), స్ట్ర‌క్చ‌ర‌ల్ ఇంజ‌నీరింగ్

మెకానిక‌ల్

ఎల‌క్ట్రిక‌ల్

కంప్యూట‌ర్ ఇంజ‌నీరింగ్‌

ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలిక‌మ్యూనికేష‌న్

ఎస్సెస్సీ టెక్నిక‌ల్ ఉమెన్ పోస్టుల అధికారిక నోటిఫికేష‌న్ ఇక్క‌డ క్లిక్ చేయండి 


6. మిల‌ట‌రీ న‌ర్సింగ్ స‌ర్వీస్ 2019

ఎంఎస్సీ న‌ర్సింగ్ లేదా బీఎస్సీ న‌ర్సింగ్ పూర్తి చేసినవారిని భార‌త సైన్యం మిల‌ట‌రీ న‌ర్సింగ్ స‌ర్వీసెస్‌లోకి తీసుకుంటుంది.

ఉద్యోగార్హ‌త‌లు

వ‌యో ప‌రిమితివిద్యార్హ‌త‌
ఎంపిక ప్ర‌క్రియ‌

23-38 ఏళ్ల మ‌ధ్య‌లో(02 జ‌న‌వ‌రి 1981 నుంచి 01 జ‌న‌వ‌రి 1995 మ‌ధ్య‌లో జ‌న్మించిన‌వాళ్లు)
బీఎస్సీ(న‌ర్సింగ్‌)/ఎంఎస్సీ (న‌ర్సింగ్‌) 

భార‌త సైన్యం న‌ర్సింగ్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (అబ్జెక్టివ్ టైప్‌)ఇంట‌ర్వ్యూవైద్య ప‌రీక్ష‌

జీతం – రూ.16,500 + గ్రేడ్ పే రూ.5400 + మిల‌ట‌రీ స‌ర్వీస్ పే-రూ.4200/- +డీఏ, ఇత‌ర అల‌వెన్సులు ప్ర‌స్తుత ధ‌ర‌ల‌ను బ‌ట్టి చెల్లించ‌బ‌డ‌తాయి. ప్ర‌త్యేక రేష‌న్‌, ప్ర‌త్యేక సౌక‌ర్యాలు క‌ల్పించ‌బ‌డ‌తాయి.

అధికారిక నోటిఫికేష‌న్ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి 


7. ఎస్సెస్సీ ఆఫీస‌ర్ ఆర్మీ డెంట‌ల్ కార్ప్స్

ప్ర‌భుత్వ ఉద్యోగం చేయాల‌నుకునేవాళ్లు, దేశానికి సేవ చేయాల‌నుకునేవాళ్ల‌కు ఈ దంత వైద్యురాలి ఉద్యోగం ప‌నికొస్తుంది.

వ‌యో ప‌రిమితివిద్యార్హ‌త‌ఎంపిక ప్ర‌క్రియ
గ‌రిష్ట వ‌యో ప‌రిమితి – 45 ఏళ్లు
బీడీఎస్‌/ఎండీఎస్‌నీట్ 2019

స్క్రీనింగ్‌ఇంట‌ర్వ్యూవైద్య‌ ప‌రీక్ష‌

ఆర్మీ డెంట‌ల్ కార్ప్స్‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

ఇక్క‌డ క్లిక్ చేసి ఆర్మీ ఫిమేల్ భ‌ర్తీ 2019-2020 ఫేస్ బుక్ గ్రూపులో చేరండి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు నింప‌డం ఎలా?

స్టెప్ 1- మొద‌ట భార‌త సైన్యం అధికారిక వెబ్‌సైట్లోకి లాగిన్ అవ్వండి. www.joinindianarmy.nic.in

స్టెప్ 2– ఆఫీస‌ర్స్ సెల‌క్ష‌న్ ట్యాబ్ కు వెళ్లి  అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేయండి.

స్టెప్ 3- మీ వ్య‌క్తిగ‌త వివ‌రాలు నింపి ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించండి. అన్ని వివ‌రాలు స‌రిగా ఉండాలి.  ఆధార్ కార్డు లేదా ఆధార్ ఎన్ రోల్ నెంబ‌ర్‌తో ఆ వివ‌రాలు స‌రిపోలాలి.

స్టెప్ 4- మీ అకౌంట్ వెరిఫైడ్ అయిందో లేదో చూసుకోండి. మీ రిజిస్ట్ర‌ర్డ్ ఈ మెయిల్ కు ఓటీపీ వ‌స్తుంది. ఆ ఓటీపీ న‌మోదు స‌బ్‌మిట్ బ‌ట‌న్ మీద క్లిక్ చేయండి.

స్టెప్ 5- మిగ‌తా వివ‌రాల‌న్నీ పూరించండి.

వ్య‌క్తిగ‌త వివ‌రాలు – మీరు పూరించిన వివ‌రాల‌న్నీ స‌రిగా ఉన్నాయో లేదో చూసుకోండి.

సెక్యూరిటీ ప్ర‌శ్న – ఒక సెక్యూరిటీ ప్ర‌శ్న ఎంచుకుని దానికి స‌మాధానం ఇవ్వండి.

విద్యార్హ‌త వివ‌రాలు – మీ విద్యార్హ‌త వివ‌రాలు పూరించండి.

పాస్‌వ‌ర్డ్ అవ‌స‌రం – మీ పాస్‌వ‌ర్డ్ క్రియేట్ చేసుకోండి.

సేవ్ ఆప్ష‌న్ మీద క్లిక్ చేయండి.

స్టెప్ 6- ఇపుడు మీ ప్రొఫైల్ సిద్ధ‌మైంది. చిరునామా లాంటి మిగ‌తా వివ‌రాలు మీరు పూరించ‌వ‌చ్చు.

స్టెప్ 7- మీ ద‌ర‌ఖాస్తు ఫారం పూరించడం అయిపోగానే స‌బ్మిట్ చేయండి. మీ అప్లికేష‌న్ సంబంధించిన సంక్షిప్త స‌మాచార పేజీ మీకు క‌నిపిస్తుంది. మీ వివ‌రాల‌న్నీ స‌రిగా ఉన్నాయో లేదో చూసుకోండి. కావాలంటే వివ‌రాల్లో మార్పులు చేయ‌వ‌చ్చు. వివ‌రాల‌న్నీ స‌రిగా ఉన్నాయ‌ని క‌న్‌ఫ‌ర్మ్ చేసుకున్నాక స‌బ్‌మిట్ బ‌ట‌న్ మీద క్లిక్ చేయండి. 30 నిమిషాల త‌ర్వాత అభ్య‌ర్థులు త‌మ ద‌ర‌ఖాస్తు ఫారాల‌ను రెండు కాపీలు ప్రింట్ తీసుకోవాలి. అపుడు వాటిలో మీ రోల్ నెంబ‌ర్ ఉంటుంది. స‌రిచూసుకోండి. 

_______________________________________________________________________

మీరు ఎస్సెబీ క్లియ‌ర్ చేస్తే మిమ్మ‌ల్ని శిక్ష‌ణ కోసం చెన్నైలోని ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీకి పంపిస్తారు. ఈ శిక్ష‌ణకు హాజ‌ర‌య్యే మ‌హిళ‌లు అవివాహితులై ఉండాలి. ట్రైనింగ్ పూర్తయిన వెంట‌నే ఉద్యోగంలో చేర‌వ‌చ్చు. కాబ‌ట్టి శారీర‌క శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌కు కూడా మీరు సంసిద్దులై ఉండాలి.  శారీర‌క శిక్ష‌ణ ఇలా ఉంటుంది….

ప‌రుగు – 15 నిమిషాల్లో 2.5 కిలోమీట‌ర్లు

పుష‌ప్స్ –  13

సిట‌ప్స్ – 25

చిన్ అప్స్ – 6

తాడు ఎక్క‌డం – 3-4 మీట‌ర్లు

భార‌త సైన్యం మ‌హిళా ఉద్యోగాల భ‌ర్తీకి అధికారిక నోటిఫికేష‌న్ వెబ్ సైట్‌లో ఇవ్వబ‌డింది. పైన పేర్కొన్న అన్ని ఉద్యోగాల‌కు సంబంధించిన అర్హ‌త‌లు, కావాల్సిన డాక్యుమెంట్లు, జీతం, ప‌దోన్న‌తి, శారీర‌క సామ‌ర్థ్యాలు మొదలైన వివ‌రాలు మీరు వెబ్ సైట్ లో చూసుకోవ‌చ్చు.

ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ విధానం పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌డానికి ఇక్క‌డ క్లిక్ చేయండి.


ప్రాదేశిక సైన్యం భ‌ర్తీ 2019 ప్ర‌క్రియ మొద‌లైంది. పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌డానికి ఇక్క‌డ క్లిక్ చేయండి.


2019లో భార‌త వాయు సేన లో మ‌హిళ‌ల‌కు కేటాయించిన ఉద్యోగాలకుసంబంధించిన పూర్తి స‌మాచారం కోసం ఇక్క‌డ క్లిక్ చేసి తెలుసుకోండి/a>.

భార‌త నౌకా ద‌ళంలో మ‌హిళ‌ల‌కు కేటాయించిన ఉద్యోగాల‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం కోసం ఇక్క‌డ క్లిక్ చేసి తెలుసుకోండి.

ఆర్మీ మ‌హిళా భ‌ర్తీ 2019-2020 ఫేస్ బుక్ గ్రూపులో జాయిన్ కావ‌డానికి ఇక్క‌డ క్లిక్ చేయండి.


మీకు ఏవైనా సందేహాలు, ప్ర‌శ్న‌లుంటే వాటికి స‌మాధానం ఇవ్వ‌డానికి మేం ప్ర‌య‌త్నిస్తాం.

జై హింద్‌! జై భార‌త్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here